తులసిలో ఐరన్‌ ఎక్కువే..

ఆంధ్రజ్యోతి: తులసి ఆకులు - పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు నింపుకున్న స్టోర్‌హౌస్‌లు. అందుకనే కాబోలు ఎన్నో ఔషధాల్లో తులసి ఆకుల్ని వాడుతుంటారు. 

తులసి ఆకుల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌ రక్తంలో ఆక్సిజన్‌ సరఫరాని మెరుగుపరుస్తుంది.
 
కాలేయం, మెదడు, గుండెలకు హానికలిగించే మాలిక్యూల్స్‌ను నాశనం చేయడమే కాకుండా ఫ్రీరాడికల్స్‌ వల్ల ఈ అవయవాలు దెబ్బతినకుండా కాపాడుతుంది తులసి.
 
తులసి ఆకుల రసానికి వృద్ధ్యాపు ఛాయల్ని, చర్మవ్యాధుల్ని నివారించే గుణం ఉంది. వాపు, ఉబ్బరం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
 
జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలిగించేందుకు, వళ్లు వెచ్చబడినప్పుడు తులసాకుల రసం తాగితే తగ్గిపోతుంది.
 
బ్రాంకైటిస్‌, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు, గుండె ని ఆరోగ్యంగా ఉంచి, రక్తంలో కొలెస్ర్టాల్‌ స్థాయిని తగ్గిస్తుంది.
 
రే-చీకటి, కళ్లమంటలకి తులసాకుల రసాన్ని వాడితే ప్రభావంతమైన ఫలితం ఉంటుంది.
 
తులసాకుల్లో ఉండే పొటాషియం వల్ల రక్తపీడనం అదుపులో ఉంటుంది.