వాటికి చిట్కాలే మేలు!

14-06-2019:పులిపిరులు, పిగ్మెంటేషన్‌, ఆనెలు...ఇలా చర్మంపై తలెత్తే ఇబ్బందులు బోలెడు. వాటిని తొలగించుకోవడానికి వైద్యులను కలవవలసిన అవసరం లేదు. తేలికైన చిట్కాలతో వాటిని ఇంట్లోనే తొలగించుకునే వీలుంది.
 
స్కిన్‌ ట్యాగ్స్‌: వృద్ధాప్యానికి చేరువయ్యే క్రమంలో చర్మం మీద కొత్తగా వేలాడే స్కిన్‌ ట్యాగ్స్‌ తలెత్తుతూ ఉంటాయి. కనురెప్పలు, బాహుమూలాలు, ఛాతీ మీద తలెత్తే ఈ స్కిన్‌ ట్యాగ్స్‌ను సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా తొలగించుకోవచ్చు. యాపిల్‌ సెడార్‌ వినెగర్‌లో దూదిని ముంచి, పిండి, స్కిన్‌ ట్యాగ్‌ మీద పట్టు వేయాలి. కొన్ని రోజులకు అది నల్లగా మారి రాలిపోతుంది.
 
పిగ్మెంటేషన్‌: చర్మం మీద తలెత్తే ఎరుపు, ముదురు గోధుమ రంగు మచ్చలను వదిలించడమూ తేలికే. ఇందుకోసం సోడా ఉప్పు, ఆముదం రెండింటినీ కలిపి ముద్దలా తయారుచేసి, మచ్చల మీద అద్ది పట్టు వేయాలి. ఇలా రాత్రంతా ఉంచి, నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. ఇలా కొద్ది రోజులు క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
పులిపిరి: ప్రతి రాత్రి పులిపిరిని అరటి తొక్కతో రుద్దుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు పులిపిరి ఊడిపోతుంది. లేదంటే ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు పులిపిరి మీద తేనె అద్దుకుని, కట్టు కట్టుకోవాలి.