బిరియానీ ఆకు భళా!

27-08-2019: ఈ ఆకును బిరియానీలో తప్ప మిగతా వంటకాల్లో వాడం. వాసన కోసం వాడే  ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే తరచుగా వంటకాల్లో ఈ ఆకును వాడుతూ ఉండాలి.

శ్వాసకోశ వ్యవస్థ: ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ‘ఇంటర్‌ల్యూకిన్‌’ అనే ప్రొటీన్‌ను వ్యాధినిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేస్తూ ఉంటుంది. బిరియానీ ఆకు తరచుగా తీసుకుంటే ఈ ప్రొటీన్‌ విడుదల తగ్గుతుంది.
 
కొలెస్ట్రాల్‌: చెడు కొలెస్ట్రాల్‌, చక్కెరలను తగ్గించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ తయారయ్యేలా బిరియానీ ఆకు తోడ్పడుతుంది.
 
కేన్సర్‌: తరచుగా వంటకాల్లో బిరియానీ ఆకు వాడడం వల్ల కొన్ని రకాల కేన్సర్‌లు, ప్రధానంగా ‘కోలోరెక్టల్‌’ కేన్సర్‌ ముప్పు తప్పుతుంది.
 
ఆరోమాథెరపీ: నిద్రపోయే సమయంలో దిండు పక్కనే తువ్వాలు మీద రెండు చుక్కల బే లీఫ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి పడుకుంటే, కమ్మని నిద్ర పట్టడంతో పాటు, ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో నిద్ర లేస్తారు!