గుండె రక్తనాళాలకు రక్షగా!

24-09-2019:ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్త ప్రసరణ మార్గం చిన్నదవుతుంది. ఈ సమస్యనే ఎథిరోస్ల్కెరోసిస్‌ అంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఽధమనులు ఇంకా ఇంకా కుంచించుకుపోయి గుండెకు, మెదడుకు, మూత్రపిండాలకు శరీరంలోని సమస్త ధాతువులకు జరిగే రక్తసరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి.

పైగా కుంచించుకుపోయిన ధమనుల్లో రక్తం సరిగా ప్రవహించలేక చిన్న చిన్న ముద్దలుగా ఏర్పడి రక్తప్రవాహాన్ని అడ్డగిస్తాయి. దీని వల్ల గుండెపోటు రావడమో, మెదడు రక్తకణాలు చిట్లిపోవడమో జరిగి ప్రాణాపాయం ఏర్పడుతుంది. సమస్య అంతదాకా వచ్చిన తర్వాత బెంబేలెత్తిపోయే కన్నా, అసలు ఆ సమస్యే రాకుండా నివారించే ప్రయత్నాలు చేయడం ఎంతో ఉత్తమం. 

అందుకోసం...

రోజూ ఒక వెల్లుల్లి రేకును నమిలి మింగితే చాలు.
వెల్లుల్లిని పాలలో ఉడికించి పాయసం (రసోనా క్షీరం) తయారు చేసుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది.
పాయసం తయారు చేసే పద్ధతి:
ఐదుగ్రాముల వెల్లుల్లి రేకులు తీసుకుని, పై పొట్టును తొలగించి, వాటిని 50 మిల్లీలీటర్ల పాలల్లో 6 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసి 200 మిల్లీలీటర్ల పాలలో వేసి సగానికి సగం తగ్గేదాకా మరిగించాలి. ఆ పైన వడబోసి నేరుగా గానీ, మధుమేహం లేనివారైతే చక్కెర కలిపి గానీ రోజూ రాత్రివేళ నిద్రకు ముందు సేవిస్తే, ధమనులు గట్టిపడి, గుండె సంబంధమైన సమస్యలు రావు.