విషాలను తరిమేయవచ్చు!

27-08-2019: శరీరంలో పేరుకునే విషపదార్ధాలను ఎప్పటికప్పుడు తరిమికొట్టకపోతే, పలు రకాల రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయితే అందుకోసం వైద్య చికిత్సలనే ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కొన్ని పానీయాలను తీసుకోవడం ద్వారా కూడా వీటిని బయటకు పంపొచ్చు.
 
నిమ్మరసం, మిరియాలు: గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, మిరియాల పొడి కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని విషపదార్థాలు విసర్జనకు గురై జీర్ణశక్తి మెరుగవుతుంది.
 
కూరగాయల రసం: క్యారెట్లు, బీట్‌రూట్‌ వంటి దుంపల రసాలకు కొత్తిమీర, పుదీనా, యాపిల్‌ రసాలను జోడించి తీసుకున్నా డిటాక్సిఫికేషన్‌ జరుగుతుంది.
 
కలబంద: కలబంద రసం లేదా గుజ్జును నీళ్లు లేదా బత్తాయి రసంతో పరగడుపున తీసుకుంటే దేహంలోని హానికరపదార్థాలు నశించి, నీరసం తొలగి ఉత్తేజం పొందుతాం.
 
ఉసిరి: మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి ఉపయోగపడే ఉసిరి రసం శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఉసిరి కాయలను ఉదయాన్నే మిక్సీలో రుబ్బి రోజులో మూడు సార్లు తాగాలి.