బియ్యంలో పురుగులా?

15-10-2019: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బియ్యం డబ్బాలో, పప్పుల డబ్బాలో పురుగులు ఉంటున్నాయా? ఈ సమస్యకు వంటింట్లోనే పరిష్కారం ఉంది. అదెలాగో చూద్దాం...
పప్పు దినుసులు, బియ్యాన్ని గాలిచొరబడని డబ్బాల్లో ఉంచడం వల్ల పురుగులు, కీటకాలను నివారించవచ్చు. వదులు మూత ఉన్న డబ్బాలో బియ్యం ఉంచితే అందులో బిరియానీ ఆకు లేదా కొన్ని వేపాకులు ఉంచితే పరుగులు పట్టవు.
లవంగం నూనె కీటకనాశినిగా పనిచేస్తుంది. దీనిలో ముంచిన వస్త్రంతో షెల్పులను తుడిస్తే, ఆ వాసనకు పురుగులు రావు.
బియ్యాన్ని ఫ్రిజ్‌లో కొద్ది సేపు ఫ్రిజ్‌లో ఉంచితే, చల్లని వాతావరణానికి పురుగులు, చిన్నచిన్న కీటకాలు చనిపోతాయి. ఆ తరువాత బియ్యాని గది బయట ఉంచాలి.
పొట్టు తీయని వెల్లుల్లి పాయలను బియ్యం డబ్బాలో వేసి, వాటి తేమ పోయాక బయటకు తీయాలి.
బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిసేపు ఎండలో ఉంచాలి. వేడి తగలగానే కీటకాలు, పురుగులు బియ్యంలోంచి బయటకు వస్తాయి. అప్పుడప్పుడు ఇలాచేస్తే పురుగల బెడద తప్పుతుంది.