ఇలా నిద్ర లేవాలి!

20-08-2019:నిద్ర లేవడం అంటే, చటుక్కున లేచి, ఒళ్లు విరుచుకుని మంచం దిగడం సరి కాదు. అప్పటివరకూ విశ్రాంత స్థితిలో ఉన్న నాడులన్నీ దినచర్యకు తగ్గట్టు ఉత్తేజం పొందేలా నిద్ర లేవడానికి నిర్దిష్ట పద్ధతి అనుసరించాలి.
 
కుడిపక్కకు తిరగాలి: నిద్ర మెలకువ కాగానే కుడిపక్కకు తిరగాలి. నిద్ర లేచిన వెంటనే మెటబాలిజం తక్కువగా ఉంటుంది కాబట్టి, కుడిపక్కకు తిరిగి లేచి, మంచం దిగాలి. అలాకాకుండా ఎడమ పక్కకు తిరిగి, లేచి నిలబడే ప్రయత్నం చేస్తే గుండె మీద ఒత్తిడి పడుతుంది.

అరచేతులు రుద్దుకోవాలి: నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతులు రుద్దుకుని కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అరచేతుల్లో ఉండే నాడులు ఉత్తేజితమై శరీర వ్యవస్థ పూర్తి స్పృహలోకి వస్తుంది.