పొడిదగ్గు నయం కావాలంటే..

దగ్గు: నల్లద్రాక్ష రసం వీరికి మంచి ఔషధం! శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది తొలగిస్తుంది.

పొడిదగ్గు ఉంటే, బాదం గింజల్ని రెండు గంటల పాటు నీళ్లల్లో నానపెట్టి తినేయవచ్చు.
ఉల్లిగడ్డను దంచి, దాంట్లో నిమ్మరసం కలిపి, నీళ్లల్లో మరిగించి తీసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది.
పచ్చి ఉల్లిపాయలను నమిలి తినేసినా ప్రయోజనమే!
 
ఉబ్బసం: ఉబ్బసానికి మూలం శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గడమే! ఆ శక్తి పెరగనంతవరకూ ఏ మందులూ, టీకాలూ వ్యాధిని తగ్గించలేవు. అయితే వెంటనే ఉపశమనం కలిగించే విధానాలు కొన్ని ప్రకృతి వైద్యచికిత్సలో ఉన్నాయి. అవేంటంటే...
గోరువెచ్చని పాలలో, లేదా నీళ్లలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి, రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఆస్తమానుంచి ఉపశమనం లభిస్తుంది.
మూడు వెల్లుల్లి పాయలను, 30 మి.లీ పాలలో వేసి మరిగించి తాగినా ఉపశమనం లభిస్తుంది.
గ్లాసు పాలల్లో ఒక టేబుల్‌ స్పూను పసుపు వేసి, మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 
న్యుమోనియా: న్యుమోనియా అన్ని వయసుల వారికీ రావచ్చు.
వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఛాతీపైన వెల్లుల్లి రసంతో మర్దన చేసినా ఉపయోగమే!
సమస్య తొలిదశలో ఉన్నప్పుడు హెర్బల్‌ టీ వీరికి బాగా ఉపయోగపడుతుంది.
 
మీజిల్స్‌: జ్వరం, జలుబు, కళ్లల్లోంచి నీళ్లు కారడం వంటి లక్షణాలతో కూడిన ఈ వ్యాధికి....
కమలాపండు రసం వీరికి మంచి ఔషధం! రోజూ మూడు సార్లు ఈ రసం ఇవ్వవచ్చు!
నిమ్మరసం కలిపిన నీరు కూడా వీరికి ఉపశమనం ఇస్తుంది.
పసుపు చెట్టు వేర్లను ఎండబెట్టి, పొడి చేసి, తేనెతో కలిపి తీసుకుంటే ఎంతో మేలు.
 
ఇన్‌ఫ్లూయెంజా: ఒక గ్రాము తులసి ఆకులను, సగం చెంచా అల్లం పేస్ట్‌ వేసి, డికాక్షన్‌ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి, పసుపు మిశ్రమం చేసి రోజుకు మూడుసార్లు తేనెతో తీసుకుంటే ఎంతో మేలు.

బ్రాంకైటిస్‌: టీ స్పూను పసుపు పొడిని, గ్లాసు పాలలో వేసి మరిగించి తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది.
అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
- డాక్టర్‌ టి. కృష్ణమూర్తి, సూపరింటెండెంట్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ,
యోగా అండ్‌ నేచర్‌ క్యూర్‌ సెంటర్‌, హైదరాబాద్‌