ఆరోగ్యానికి అండ జుచినీ!

23-08-2019: జుచినీలో యాంటీ-ఆక్సిండెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికీ, గుండెకూ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు కొన్ని రకాల కేన్సర్లను నిరోధిస్తాయి.
ఇందులో నీరు, పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల, జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్దకం సమస్య తొలగిపోతుంది. దీనికి తోడు జీర్ణాశయ సంబంధమైన గ్రహణి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
షుగర్‌ నిల్వల్ని తగ్గించే గుణం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జుచినిలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీరం బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
రాత్రంతా ప్రయాణం చేయాల్సి వచ్చిన సమయంలో జుచిని తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్య దరిచేరకుండా, ఇతరత్రా ఉదర సమస్యల బాధ తప్పుతుంది.