ఆమ్‌చూర్‌తో ఆరోగ్యం!

24-09-2019: ఆమ్‌చూర్‌ (మామిడి పొడి)లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టే పలు రకాల ఆయుర్వేద ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎ, ఇ, సి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆమ్‌చూర్‌తో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ....
 
జీర్ణశక్తి: ఆహార పదార్థాలతో కలిపి ఆమ్‌చూర్‌ తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవడంతో పాటు కడుపులో మంట తొలుగుతుంది. దీన్లోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల పేగుల కదలికలు పెరిగి మలబద్ధకం తొలగుతుంది.
 
డీటాక్సిఫికేషన్‌ మెరుగు: ఎ, సి, డి, బి6 విటమిన్లు శరీరం నుంచి విషాలను బయటకు వెళ్లగొడతాయి. కాబట్టి డీటాక్సిఫికేషన్‌ కోసం ఆమ్‌చూర్‌ను తరచుగా తీసుకోవాలి.
 
బరువు అదుపులో: దీన్లో అతి తక్కువ పిండిపదార్థాలు ఉంటాయి. మెటబాలిజంను పరుగులు పెట్టించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి క్రమం తప్పక ఆమ్‌చూర్‌ను ఆహారంతో కలిపి తీసుకుంటూ ఉంటే అధిక బరువు తగ్గడంతో పాటు బరువు అదుపులోనూ ఉంటుంది.