తలనొప్పితో ఉల్టాపల్టా?

ఆంధ్రజ్యోతి:మనకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినపుడు ‘అదో పెద్ద తలనొప్పి’ అంటుంటాం. నిజంగానే తలనొప్పి మనిషిని మరీ ఇబ్బందికి గురిచేస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే..
 
తలనొప్పికి గురయ్యేవారు మంచి డైట్‌ని పాటించాలి. రెగ్యులర్‌గా తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే వాటిలోని విటమిన్స్‌, మినరల్స్‌ పొందవచ్చు. అసలు తలనొప్పికి కారణాలేంటో తెలుసుకోవాలి. మానసిక ప్రశాంతత లేకపోవడం, నిద్రలేమి లేదా దగ్గు వల్ల ఏమైనా తలనొప్పి వస్తుందో చూసుకోవాలి.
 
కావాల్సినంత నిద్రపోయే సమయం వెచ్చించలేనపుడు అధికంగా తలనొప్పి పట్టి పీడిస్తుంది. ఇక నిద్రలేమితో బాధపడే వారు అప్పుడప్పుడూ 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కునుకు తీయటం మంచిది. దీని వల్ల తలనొప్పి తగ్గుతుంది.
 
తలనొప్పితో బాధపడే వారికి శ్వాసకి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌ ఉపయోగం. ఉచ్వాసనిశ్వాసల్ని మెల్లగా తీసుకుంటూ ప్రాక్టీస్‌ చేయటం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
 
మసాజ్‌ చేయటం వల్ల తలనొప్పి బాగా తగ్గిపోతుంది. తలనొప్పి సమయంలో కణత, తల ముందు భాగాన్ని వేళ్లతో రుద్దటం వల్ల ఉపశమనం కలుగుతుంది.
 
పరిమళం, సుగంధాన్ని వెదజల్లే గంధపు చెక్క వాసన పీల్చటం, దీంతో పాటు తులసి నూనె లాంటివి పీల్చటం వల్ల తలనొప్పి పోవటంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది.