మతిమరుపా...? మందు ఉంది!

11-06-2019: అన్ని రకాల డిమెన్షియాలను నూటికి నూరు శాతం నయం చేయడం అసాధ్యం! అయితే కొన్ని రకాల హార్మోన్ల లోపాల కారణంగా తలెత్తే మతిమరుపులను తగ్గించడం, నయం చేయడం సాధ్యమే! అవేంటంటే...
విటమిన్‌ బి12 లేదా థైరాయిడ్‌ సమస్యల కారణంగా మతిమరుపునకు లోనైతే ఆ కారణాలను వైద్యంతో సరిదిద్దడం ద్వారా మతిమరుపును నివారించవచ్చు.
మెదడులో రక్తం గడ్డకట్టడం లేదా ట్యూమర్‌ కారణంగా డిమెన్షియా తలెత్తితే, ఆ సమస్యలను చికిత్సతో నయం చేయడం ద్వారా మతిమరుపును తొలగించవచ్చు.
సహజసిద్ధంగా మెదడు కణాలు మృతి చెందడం ద్వారా తలెత్తే అల్జీమర్స్‌ వ్యాధి విషయంలో ఆ ప్రక్రియను నెమ్మదించి, మతిమరుపు క్షీణతను నియంత్రించే వీలు కూడా ఉంది.