ఇవి తింటున్నారా!

27-08-2019:  ఈ సీజన్‌లో డైట్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవడం ద్వారా జీర్ణపరమైన సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ కె.పి.దివ్య. ఆమె చెబుతున్న ఆహార సూచనలివి...
 
హెర్బల్‌ టీ: ఔషధ గుణాలున్న గ్రీన్‌ టీ, పుదీనా టీ, అల్లం టీలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. అంతేకాదు వీటిలోని యాంటీ సెప్టిక్‌ గుణాలు పొట్టలో నొప్పిని తగ్గిస్తాయి. టీలో అల్లంతోపా టు యాలకులు వేసుకొని తాగితే మరీ మంచిది.
 
సూప్స్‌: వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ’సూప్స్‌ తాగితే ఆకలి పెరుగుతుంది. శరీరంలో తగ్గిన నీరు భర్తీ అవుతుంది. వీటిలోని విటమిన్లు, మినరల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్రీమీ సూప్స్‌ బదులు కొవ్వులు తక్కువగా ఉండే పలుచని సూప్స్‌ తాగితే పొట్ట తేలికగా అనిపిస్తుంది. తొందరగా శక్తి లభిస్తుంది.
 
పాల ఉత్పత్తులు: వానాకాంలో పాలు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి. అందుకే ప్రోబయాటిక్స్‌, మేలు చేసే బ్యాక్టీరియా అధికంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.