బాడీ పెయిన్స్‌కు వీటితో చెక్‌!

19-10-2019: కూర్చున్నా, నిలుచున్నా నిటారుగా ఉండాలి. వాలిపోయినట్టుగా ఉంటే వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి. సరైన పొజిషన్‌లో కూర్చోవడం, నిల్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు తలెత్తవు. స్లిమ్‌గా కనిపిస్తారు. లిగమెంట్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. వెన్నులో నొప్పిని తగ్గించి, తీరైన శరీరాకృతిలో కనిపించేందుకు ఉపయోగపడే వ్యాయామాలు కొన్ని.
 
క్రంచెస్‌: ఈ వ్యాయామం శరీరం మొత్తాన్ని పటిష్ఠం చేస్తుంది. వీపుభాగం, పొట్ట భాగంలోని కండరాలు ఫిట్‌గా మారతాయి. స్పాండిలోసిస్‌ సమస్య (వెన్నుముక సమస్య) ఉన్నవారు పాక్షిక క్రంచెస్‌ చేస్తే ఫలితం ఉంటుంది.
 
హామ్‌స్ట్రింగ్‌ స్ట్రెచెస్‌: ఒక్కోసారి వీపుభాగం, కాలి వెనక భాగంలో పట్టేసినట్టు అనిపిస్తుంది. అలాంటి సమయంలో హామ్‌స్ట్రింగ్‌ వ్యాయామం చేస్తే, ఉపశమనం లభిస్తుంది.
 
పెల్విక్‌ బ్రిడ్జెస్‌: వెన్నునొప్పితో బాధపడేవారికి ఈ వర్కవుట్‌ తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది. వెన్నుముకకు సపోర్టుగా నిలిచే హామ్‌స్ట్రింగ్స్‌, గ్లూటెస్‌, ఛాతి, తుంటి కండరాలు బలీయం అవుతాయి. వీపు భాగంలోని కండరాలు దృఢంగా మారతాయి కూడా.
 
వాల్‌సిట్స్‌: వెన్నులో నొప్పిగా అనిపించినప్పుడు కొన్ని సెకన్ల పాటు వాల్‌సిట్స్‌ చేయాలి. దాంతో నొప్పి తగ్గి, ఉత్సాహం నిండుతుంది.
 
ప్లాంక్స్‌: ఈ సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌తో చాలా ఆరోగ్య లాభాలున్నాయి. కాళ్లను నిటారుగా ఉంచాలి. వీపుభాగం కిందికి వంగకుండా చూడాలి. నేల మీద కూర్చున్నట్టుగా ఉండాలి. ఈ వ్యాయమంతో సరైన పొజిషన్‌ వస్తుంది.