బీట్‌రూట్‌తో రక్తహీనతకు చెక్‌!

బీట్‌రూట్‌ పోషకాలతో నిండిన హెల్తీఫుడ్‌. దీన్ని వెజిటబుల్‌, స్నాక్‌, సలాడ్‌ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు. వేరుజాతికి చెందిన ఈ దుంప రక్తహీనతను తగ్గిస్తుంది. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలేమంటే....
 
  • శరీరానికి అవసరమైన ఫైబర్‌, యాంటీ ఆక్సిండెంట్లు, మినరల్స్‌, విటమిన్లు బీట్‌రూట్‌లో పుష్కలం.
  • బీట్‌రూట్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే ఐరన్‌ సమృద్ధిగా లభించి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
  • గ్లాసు బీట్‌రూట్‌ రసం శరీరానికి శక్తినివ్వడమేక కాదు అనారోగ్యాన్ని దరిచేరనీయదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎ, బి6 విటవిన్లు కాలేయాన్ని ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేటివ్‌ ఒత్తిడి నుంచి కాపాడుతాయి.
  • దీనిలోని నైట్రేట్స్‌ రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ జబ్బుల ముప్పును నివారిస్తాయి. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పెంచి చురుకుదనం పెంచుతుంది.
  • బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము, ప్రొస్టేట్‌ కేన్సర్‌ను నివారిస్తాయి.
  • దీనిలోని ఫైబర్‌ రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించి, రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బీట్‌రూట్‌ తినొచ్చు.
  • ఈ దుంపలోని జింక్‌, కాపర్‌, ఎ,సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • బీట్‌రూట్‌ రసం తాగితే కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ఎనర్జీతో పనిచేయగలుగుతారు.
  • తరచుగా బీట్‌రూట్‌ తింటే జీర్ణక్రియ మెరుగపడుతుంది. చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరుగుతుంది.
  • వీటిలోని ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు ఎంతో అవసరం. ఇది పుట్టబోయే బిడ్డలో మెదడు సంబంధ లోపాలు ఏర్పడకుండా చూస్తుంది.
  • బీట్‌రూట్‌లోని బోరాన్‌ లైంగిక హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది.
  • దీనిలోని కెరోటినాయిడ్స్‌, విటమిన్‌ ఎ కాటరాక్ట్‌ ముప్పు నుంచి కళ్లను కాపాడతాయి.
  • ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేందుకు వీటిలోని కాల్షియం తోడ్పడుతుంది.
  • దీనిలోని ల్యుటిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌ ఫ్రీరాడికల్స్‌ను తొలగించి ముఖం మీది ముడతల్ని నివారిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.