పోషకాహార లోపం రక్తహీనత శాపం

జీవించడానికి కావలసిన ప్రాణవాయువును శరీరానికి అందించేది ఇనుము. ఈ లోహ ఽధాతువు రక్తంలో తగ్గిపోవడం వల్ల శరీరం తెల్లగా పాలిపోతుంది. ఇది రక్తహీనతకు సూచన. ఆయుర్వేదంలో ఈ సమస్యకు ‘పాండువ్యాధి’ అని పేరు. 

కారణాలు అనేకం 

కొంతమంది స్త్రీలు, మితిమీరిన ఉపవాసాలు ఉంటూ, ఇంటిల్లిపాదికీ సేవలు చేస్తూ, సరైన వేళకు భోజనం చేయరు. దీనివల్ల ఆహారం ద్వారా అందవలసిన పోషకాలు వీరికి అందకుండా పోతాయి. ప్రత్యేకించి మన దే శంలోని సీ్త్రలల్లో ఎక్కువ మంది ఈ రకంగా సంక్రమించే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.
 
కొంత మంది స్త్రీలు అధిక రక్తస్రావం కారణంగా, ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం కారణంగా లేదా ఏవైనా పెద్ద గాయాల వల్ల ఈ రక్తలేమి సమస్యకు గురువుతున్నారు.
 
ఎదిగే పిల్లల్లో కూడా సరియైున పోషకాలున్న ఆహారం ఇవ్వకపోవడం వల్ల వారిలో రక్తలేమి సమస్య కనిపిస్తుంది.
 
కొన్ని రకాల వైరస్‌, బ్యాక్టీరియాల కారణంగా కలిగే వ్యాధుల వల్ల, కొన్నిరకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం వల్ల, విషపదార్థాల వల్ల, శరీంలో చెడు రక్తం నిలిచిపోవడం వల్ల కూడా రక్తకణాల్లోని లోహధాతువు తగ్గి కొందరిలో రక్తహీనత చోటుచేసుకుంటుంది.
 
పాండు వ్యాధిగ్రస్తుల్లో ర క్తలేమి కారణంగా కనురెప్పల లోపలి భాగం పేలవంగా, నిర్జీవంగా కనపడుతుంది. వీరిలో తీవ్రమైన బలహీనత, కళ్లు తిరగడం, ఆయాసం, గుండెదడ, రక్తపోటు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనపడతాయి. 

వ్యాధి ప్రాథమిక ధశలో ఉన్నప్పుడు ఈ కింది శులభక్రియలు పాటించడం ద్వారానే ఎంతో మేలు కలుగుతుంది. 
ముడి నువ్వుల్లో, కొంచెం బెల్లం కలిపి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
 
పళ్లరసాలు, పాలు, ఆకుపచ్చని కాయకూరలు, ఆకూకూరలు ఎక్కువగా తినాలి.
 
తియ్యని మామిడి పండ్లు తింటే రక్తహీనత చాలా త్వరగా తగ్గుతుంది.
 
కప్పు ఉసిరికాయ రసంలో గానీ, కప్పు చెరుకు రసంలో గానీ, పది గ్రాముల వరి పేలాల పిండి కలిపి బాగా చిలికి, ఆ తర్వాత రెండు టీ-స్పూన్లు తేనె కలిపి తాగుతూ ఉంటే పాండు వ్యాధి చాలా త్వరగా తగ్గుతుంది.
 
ఒక టీ -స్పూన్‌ అతి మధుర చూర్ణంలో ఒక టీ-స్పూన్‌ తేనె కలిపి రోజూ తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు.
 
- డాక్టర్‌ కందమూరి 
ఆయుర్వేద విజ్ఞానకేంద్రం 
మెయిల్‌ - [email protected]