ఆ ఉప్పుతో స్నానం చేస్తే...

16-09-2019: ఇంగ్లండ్‌లోని ఎప్సమ్‌ అనే ప్రాంతంలో కనుగొనబడి, ఆ పేరుతో వాడుకలోకి వచ్చిన ఎప్సమ్‌ సాల్ట్‌... ‘భేది ఉప్పు’తో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెగ్నీషియం, సల్ఫర్‌, ఆక్సిజన్‌లు కలగలసిన రసాయన లవణం టేబుల్‌ సాల్ట్‌గానే కనిపించినా, దీనికి ఉన్న ప్రత్యేక గుణాలు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి.
 
ఈ ఉప్పును స్నానపు నీటిలో కలుపుకుంటే...
స్నానపు తొట్టిలో నీళ్లు నింపి భేది ఉప్పు కలిపి కనీసం గంట పాటు సేద తీరితే ఒంట్లోని విషాలు, లోహాలు వదిలిపోతాయి.
దీన్లోని అత్యధిక మెగ్నీషియం శరీరాన్ని సేద తీర్చి, రాత్రి కంటి నిండా నిద్ర పట్టేలా చేస్తుంది.
శరీరంలో మెగ్నీషియం కొరత తొలుగుతుంది.
ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా తలెత్తే నొప్పులు తగ్గుతాయి.
నాడీ వ్యవస్థ, కీళ్ల పనితీరుకు ఉపయోగపడే భేది ఉప్పులోని సల్ఫేట్‌ను శరీరం చక్కగా పీల్చుకుని, ఉపయోగించుకుంటుంది.
గౌట్‌, అథ్లెట్స్‌ ఫుట్‌, కాలి బొటనవేలి ఫంగస్‌ మొదలైన సమస్యలు భేది నీటి స్నానంతో అదుపులోకి వస్తాయి.