జీలకర్రతో రక్తహీనత దూరం...

06-09-2019: వంటలకు రుచినీ, సువాసననూ అందించే జీలకర్రలో ఔషధ గుణాలు బోలెడు. సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా దీని వాడకం ఎక్కువే. ఈ సుగంధ ద్రవ్యంలోని ఇతర సుగుణాలివి...
 
జీలకర్రను మరిగించి, ఆ నీళ్లను తాగితే కడుపు నొప్పి, మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది.
జీలకర్ర ఐరన్‌కు మంచి వనరు. దాంతో రక్తహీనతను నివారిస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం ఎక్కువవుతుంది.
వీటిలోని అత్యవసర నూనెలు ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి ఊపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తాయి.
జీలకర్రలోని యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు చర్మం మీద ముడతల్ని, వయసు పెరగడం వల్ల వచ్చే మచ్చల్ని, చర్మం వదులుకావడాన్ని నియంత్రిస్తాయి.
జీలకర్ర నీళ్లను పరిగడుపునే తాగితే రక్తంలో గ్లూకోజ్‌ తగ్గి, డయాబెటీస్‌ అదుపులో ఉంటుంది.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పెద్దపేగు, రొమ్ము కేన్సర్‌ను నివారిస్తాయి.