పంచసూత్రాలతో పండంటి ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి, 28/10/14: మీరు జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలంటే అయిదు రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటారు వైద్యనిపుణులు. ఆవేమిటో తెలుసుకుందాం రండి.

 
నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రజల జీవనంలో రెస్టారెంట్‌లకు వెళ్లడం సర్వసాధారణంగా మారింది. బయట తినడం కూడా పెరిగింది. కాని ఇంట్లో వండిన ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. డబ్బు ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
 
ఎయిర్‌ కండీషన్డ్‌ కార్యాలయంలో పనిచేస్తున ్నపుడు మీకు దప్పిక లేకున్నా అప్పుడప్పుడు మంచినీరు తాగుతుండటం మంచిది. మీ శరీరంలోని విషపదార్థాలను తొలగించటానికి ఉపయోగపడతాయి.
 
మీరు ప్రతిరోజూ యోగా, జాగింగ్‌, స్విమ్మింగ్‌, బాస్కెట్‌బాల్‌ ఆడటం, లాంటిదేదైనా శరీర వ్యాయామం తప్పనిసరిగా చేయండి. వ్యాయామంతో మీ మజిల్స్‌ దృఢంగా మారతాయి.
 
ఆందోళన చెందడం వల్ల మీ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండి ఆందోళన చెందకుండా ఉండటం మేలు.
 
ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపాలంటే మీ కుటుంబం, స్నేహితులు, బంధువులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. ఈ పంచసూత్రాలు పాటించడం ద్వారా మనం నిత్యం ఆరోగ్యంగా, సరదాగా, ఉల్లాసంగా, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.