శాకాహారానికి మారితే మెదడుకు పోషకాల కొరత!

05-09-2019: ఇంతకాలం మాంసాహారం తిన్న మీరు.. ఏవేవో కారణాల వల్ల శాకాహారానికి మారారా? అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. దీని వల్ల మెదడు సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమయ్యే కోలిన్‌ వంటి పోషకాలు సరిగా అందవని వెల్లడించారు. దీనిని కాలేయమే స్రవించినప్పటికీ.. అది శరీర అవసరాలకు సరిపోదని చెప్పారు. శాకాహారానికి మారడం వల్ల కాలేయ పని తీరు కూడా ప్రభావితమవుతుందన్నారు. మాంసం, గుడ్లలో కోలిన్‌ అధికంగా ఎక్కువగా లభిస్తుందని, శాకాహారంలో అలా ఉండదని చెప్పారు. ప్రస్తుతం చాలామంది శాకాహారం వైపు మళ్లడం వల్ల అది శరీరంలో కొరత ఏర్పడుతోందని పరిశోధకురాలు ఎమ్మా డెర్బిషైర్‌ అన్నారు.