హఠాత్తుగా నిద్రలేస్తున్నారా?

ఆంధ్రజ్యోతి, 01/09/14: ఉదయాన్నే అలారం మోగుతుంది. హఠాత్తుగా నిద్ర మేలుకుంటాం. గణ గణా మోగుతున్న అలారాన్ని ఆపాలనుకుంటాం. కానీ పక్కనే ఉన్న ఫోన్‌ అందుకుని ఆన్సర్‌ బటన్‌ నొక్కుతాం. ఇలాంటి అనుభవాన్ని ‘స్లీప్‌ డ్రంకెన్‌నెస్‌’ అంటారు. ఇలాంటి స్లీపింగ్‌ డిజార్డర్‌ ప్రతి ఏడుగురిలో ఒకరికి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఈ రుగ్మత ఉన్నవారు హఠాత్తుగా నిద్ర నుంచి మేలుకుంటే అయోమయానికి గురై సంబంధంలేని పనులు చేస్తారు. 18 అంతకంటే ఎక్కువ వయస్కులైన 19 వేల మందిపై జరిపిన పరిశోధనలో దాదాపు 15శాతం మంది వారంలో ఒకసారి ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. 84శాతం మందికి స్లీపింగ్‌ డిజార్డర్‌తోపాటు మానసిక వ్యాధులు కూడా ఉన్నట్టు, యాంటీ డిప్రెసెంట్‌ మందులు తీసుకుంటున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. అలాగే నిద్రవేళల్లో తగ్గుదల కూడా స్లీపింగ్‌ డిజార్డర్‌కు దారితీస్తుందట. స్లీపింగ్‌ డిజార్డర్‌కు గురయ్యేవారిలో 20శాతం మంది 6 గంటలకంటే తక్కువ సమయం నిద్రపోయేవారు ఉన్నారు. అలాగే స్లీప్‌ ఆప్నియా ఉన్నవారు కూడా స్లీపింగ్‌ డిజార్డర్‌ బారిన పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.