విటమిన్‌-ఈ ఉత్పత్తి పదిరెట్లు పెంచే సాంకేతికత

 

న్యూఢిల్లీ, అక్టోబరు 20: పొద్దుతిరుగుడు మొక్కల్లోని అణువణువూ విటమిన్‌-ఈ భరితం!! ఆ మొక్కలు వాటి సహజ సామర్థ్యం కంటే పదిరెట్లు ఎక్కువగా విటమిన్‌-ఈ ఉత్పత్తి చేసే పద్ధతిని ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రయోగంలో భాగంగా పొద్దుతిరుగుడు మొక్కల్లో విటమిన్‌-ఈ ఉత్పత్తి చేసే జన్యువులను వేరుచేసి.. ‘అరబిడోప్సిస్‌’ మొక్కలోకి ప్రవేశపెట్టారు. కంప్యూటేషనల్‌ పరిజ్ఞానంతో.. జన్యువుల్లోని విటమిన్‌ మోతాదును పెంచే ఎంజైమ్‌లలో మార్పులు చేయడంతో విటమిన్‌-ఈ ఉత్పత్తి పదిరెట్లు పెరిగింది.