అతి వ్యాయామంతో మెదడుపై దుష్ప్రభావం

29-09-2019: అతి సర్వత్ర వర్జయేత్‌ అంటారు. వ్యాయామానికీ ఈ సూత్రం వర్తిస్తుంది. అతిగా వ్యాయామం చేస్తే మెదడుపై దుష్ప్రభావం పడుతుందని, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని పిటీ సాల్పెట్రియర్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. ట్రయథ్లెట్ల (ఈత, సైక్లింగ్‌, జాగింగ్‌ చేసే అథ్లెట్లు) పై అధ్యయనం చేశారు. వారితో అవసరానికి మించి వ్యాయామం చేయించారు. అనంతరం వారి మెదడు పనితీరును పరిశీలించారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించే మెదడులోని ఒక భాగం పనితీరు మందగించినట్లు కనుగొన్నారు.