టోన్డ్‌ పాలతో వృద్ధాప్యానికి అడ్డుకట్ట

వాషింగ్టన్‌, జనవరి 16: వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరొద్దని అనుకుంటున్నారా? అయితే కొవ్వు మోతాదు తక్కువగా ఉండే టోన్డ్‌ పాలు తాగాలని అమెరికాలోని బ్రిగ్‌హామ్‌ యంగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 5,834 మంది యుక్త వయస్కులపై కొన్నేళ్ల అధ్యయనం అనంతరం వారు ఈవిషయాన్ని వెల్లడించారు.

 
కొవ్వు అధికంగా ఉండే పాలు తాగేవారితో పోల్చుకుంటే టోన్డ్‌ పాలు తాగే వారిలో వృద్ధాప్య లక్షణాలు నాలుగేళ్లు ఆలస్యంగా కనిపిస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా కణ విభజన జరిగినప్పుడల్లా(ఒక్క కణం.. ఒకటికి మించి కణాలుగా ఏర్పడితే) టెలోమెర్ల పొడవు తగ్గిపోతుంటుంది. అయితే టోన్డ్‌ పాలు తాగేవారిలో టెలోమెర్ల పరిమాణం తగ్గే వేగం చాలా తక్కువగా ఉండటంతో.. వృద్ధాప్య ఛాయలు కనిపించడం ఆలస్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.