వృద్ధుల్లో అంధత్వానికి కారణం ఈ కణాలే!

26-10-2019: వృద్ధాప్యంలో చూపు తగ్గిపోవడానికి కారణమయ్యే కణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్లియల్‌, కోన్‌, రెటీనా కింద ఉండే రక్తనాళాలు వృద్ధాప్యంలో చూపు మందగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు తెలిపారు. జన్యు శ్రేణి విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. తాజా పరిశోధనలు అంధత్వానికి కొత్త మందును కనిపెట్టడానికి దోహదపడతాయని చెప్పారు. వృద్ధాప్యంలో సాధారణంగా రెటీనా దెబ్బతినడంవల్ల చూపు మందగిస్తుం ది. దీనికి 36 రకాల జన్యువులు కారణమవుతాయని, వాటిని ఇంకా గుర్తించలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.