దంతక్షయంలో జన్యువుల పాత్ర!

09-07-2019: దంతక్షయం, చిగుళ్ల వ్యాధి అనేది చాలామందిలో సాధారణంగా కనిపించే లక్షణాలు. ఊబకాయం, మధుమేహం వంటి వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లాగే దంతక్షయం, చిగుళ్ల వ్యాధిలోనూ జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని బ్రిటన్‌లోని బ్రిస్టల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా 9 దేశాల్లో నిర్వహించిన అధ్యనాలకు సంబంధించి 5 లక్షల మందికిపైగా డేటాను పరిశీలించి నిర్ధారించారు.