కన్నీటి చుక్క.. మధుమేహ సూచిక

17-10-2019: ఇప్పటివరకు మధుమేహ ప్రాథమిక గుర్తింపునకు అవలంబిస్తున్న పరీక్షలకు భిన్నంగా... కేవలం కన్నీటి చుక్కల ఆధారంగా వ్యాధిని నిర్ధారించే కొత్త పద్ధతి రానుంది. సిడ్నీలోని న్యూసౌత్‌వేల్స్‌ యూనివర్శిటీ ఈ మేరకు వందిమందిపై ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి వారు సమర్పించిన వివరాలతో కథనం జర్నల్‌లో ప్రచురితమైంది. కన్నీటి చుక్కల ద్వారా మధుమేహ లక్షణాలను పసిగట్టే వీలుందని వారి పరిశీలనలో స్పష్టమైంది. చాలా తేలికగా పూర్తయ్యే ఈ విఽధానంతో ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని అధ్యయనంలో పాల్గొన్న మారియా మార్కౌలీ వెల్లడించారు.