వాసనలు పసిగట్టలేకపోతున్నారా?

ఆంధ్రజ్యోతి, 07/10/14: సువాసనలు, దుర్వాసనలు వేటిని మీ ముక్కు పసిగట్టలేకపోతోందా? అయితే ఇలాంటి వారికి ఐదు సంవత్సరాల్లోపలే మృత్యు ప్రమాదం పొంచి ఉందంటున్నారు షికాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. దీనిపై వాళ్లు ఇటీవల ఒక స్టడీని నిర్వహించారు. ఆ స్టడీలో వాసనలు పసిగట్టలేకపోతున్న 39 శాతం మంది తొందరగా మృత్యుపాలయ్యారని గ్రహించారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల కాన్సర్‌ వంటివాటి వల్ల సంభవించే మరణాల కన్నా ఈ సమస్య వల్ల సంభవిస్తున్న మరణాలను తొందరగా గుర్తించగలుగుతున్నారని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి వాళ్లు చనిపోవడానికి వాసనలు పసిగట్టలేకపోవడమే ప్రధాన కారణం కాకపోయినా ఇది ఒక అనారోగ్య సూచన అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.