కిడ్నీ సమస్యలపై పరిశోధనలకు అతిచిన్న మూత్రపిండాలు

అభివృద్ధి చేసిన సింగపూర్‌ శాస్త్రవేత్తలు

సింగపూర్‌, ఆగస్టు 21: మూత్రపిండాల సమస్యలు ఎలా వస్తున్నాయో తెలుసుకునే దిశగా సింగపూర్‌ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. కిడ్నీ సమస్యల పరిశోధనలకు ఉపయోగపడే అతిచిన్న మూత్రపిండాలను నన్యాంగ్‌ సాంకేతిక వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పాలీసిస్టిక్‌ కిడ్నీ సమస్య ఉన్న ఓ రోగి కణాన్ని తీసుకుని ప్రయోగశాలలో వీటిని అభివృద్ధి పరిచారు. నెఫ్రాన్లు ఎలా అభివృద్ధి చెందుతాయి, వయసు పెరిగాక మూత్రపిండాలు ఎలా విఫలమవుతాయి అనే విషయాలను.. వీటిపై పరిశోధనలు జరిపి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.