రోటా వైరస్‌ వల్ల పిల్లల్లో మధుమేహం!

18-10-2019 (ఆంధ్రజ్యోతి): రోటా వైరస్‌.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఏడాది వయస్సులోనే చనిపోవడానికి కారణమైన వైరస్‌ ఇది. ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల భారత్‌లో ప్రతీ ఏడాది దాదాపు లక్ష మందికిపైగా పిల్లలు మృత్యువాత పడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో ఈ వైరస్‌ వల్ల పిల్లల్లో టైప్‌ 1 మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. రోటా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా తీసుకోవడం వల్ల పిల్లల్లో డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 15శాతం తగ్గినట్లు వారు గుర్తించారు.