రక్తనాళాల్లో అవరోధాల్ని తొలగించే రోబోటిక్‌ తాడు!

31-08-2019: మెదడులో రక్తం గడ్డకట్టి రక్తనాళాలు మూసుకుపోయినపుడు ఆ బ్లాకేజ్‌లను తొలిగిస్తూ సరైన చికిత్స అందించేందుకు ఉపయోగపడే రోబోటిక్‌ తాడు (త్రెడ్‌)ను అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయస్కాంతంతో నియత్రించే ఈ తాడు మూసుకుపోయిన రక్తనాళాల్లోకి సులువుగా ప్రవేశించి గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎండోవాస్కులర్‌ చికిత్సతో ఈ రోబోటిక్‌ తాడును అనుసంధానం చేస్తే భవిష్యత్తులో మెదడు నాళాలను రిమోట్‌ సాయంతో మార్గనిర్దేశం చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. బ్రెయిన్‌ స్ర్టోక్‌, హార్ట్‌ స్ర్టోక్‌ సమయాల్లో రక్తనాళాల్లో ఏర్పడిన అవరోధాలను వీలైనంత త్వరగా తొలగించే చికిత్సకు ఈ రోబోటిక్‌ తాడు సహాయం చేయనుంది.