భోజనం మానేస్తే మహిళల్లో మానసిక వ్యథ

20-08-2019: రకరకాల కారణాలతో భోజనం మానేసే మహిళల్లో మానసిక వ్యథ, అశాంతి పెరుగుతున్నాయని అమెరికాలోని బింగ్‌హాంప్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం వెల్లడించింది. సమయానికి భోజనం చేసే మహిళలు మానసికంగా ఉల్లాసంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వర్సిటీ ప్రొఫెసర్‌ డా. లీనా బెగ్‌డాష్‌ తెలిపారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ పోషకాలను తీసుకోవాలని, భోజనం మానవద్దని ఆమె సూచించారు.