గుండెపోటు పేషెంట్లకు.. ఏరోబిక్స్‌తో మేలు

16-08-2019: గుండెపోటు బారిన పడిన వారికి ఏరోబిక్స్‌ ఎంతో మేలు చేస్తాయని దక్షిణ కరోలి న పరిశోధకులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చేసే కార్డియాక్‌ రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌కు సమానమైన ఉపశమనాన్ని ఏరోబిక్స్‌ కలిగిస్తున్నట్టు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. గుండెపోటు వచ్చిన వారితో వారానికి 3సార్లు చొప్పున 3నెలలపాటు ఏరోబిక్స్‌ చేయించి మంచి ఫలితాలు రాబట్టామని పరిశోధనకు నాయకత్వం వహించిన ఎలిజబెత్‌ రీగన్‌ తెలిపా రు. చిన్నచిన్న కసరత్తులు, నడక, సైక్లింగ్‌ వంటి వాటితోనే మంచి ఫలితాలు వచ్చాయన్నారు.