‘ఒక్క పెగ్గు’ అయినా గుండెకు ముప్పే

18-10-2019: ‘ఒక్క పెగ్గే. ఏం కాదులే’ మందు అలవాటు ఉన్నవారు అప్పుడప్పుడు చెప్పే మాట ఇది. అయితే మద్యం తక్కువ మోతాదులో తీసుకొన్నప్పటికీ తరచూ తాగితే గుండెకు ముప్పని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాగినప్పుడల్లా గుండె కొట్టుకొనే వేగంలో మార్పులు వస్తాయని ఫలితంగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. దాదాపు కోటి మందిపై 8 సంవత్సరాల పాటు అఽధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు.