కాలేయ మార్పిడితో పనిలేదు..!

31-07-2019: ఇప్పటి వరకూ కాలేయం దెబ్బతిన్న వారికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చక్కని పరిష్కారం. అయితే ఇకపై కాలేయ మార్పిడి అవసరం లేదంటున్నారు బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు. కాలేయ కణజాలాన్ని పునరుత్పత్తి చేయగల సరికొత్త కణాలను వారు గుర్తించారు. వీటి సాయంతో పాడైపోయిన కాలేయానికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరం లేకుండా.. ఆ స్థానంలో కొత్త కాలేయ కణాలను ఉత్పత్తి చేయవచ్చన్నమాట. హెపటోబిలరీ హైబ్రిడ్‌ ప్రొజెనిటర్‌గా పిలిచే ఈ కొత్త కణాలు గర్భం లో మన ప్రారంభ అభివృద్ధి దశలోనే ఏర్పడతాయి.