శీతల పానియాల వినియోగంతో ప్రాణానికే ముప్పు!

05-09-2019: కాలంతో సంబంధం లేకుండా శీతలపానియాలు తెగ తాగొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా తాగితే ముందుగానే మరణించే అవకాశాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లోని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా 4.50 లక్షల మంది శీతలపానియాల వినియోగాన్ని వారు పరిశీలించారు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ డ్రింకు తాగిన వారు ముందుగానే మరణించే ప్రమాదం ఎదుర్కొంటున్నారని అధ్యయనానికి నేతృత్వం వహించిన ముర్ఫి వెల్లడించారు.