నిద్రలేమి- జంక్‌ఫుడ్‌ సంబంధం గుట్టురట్టు!

15-10-2019: రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోనివారు.. మరుసటిరోజు ఉదయాన్నే జంక్‌ఫుడ్‌ తినేందుకే ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణం మన ముక్కులోని ఘ్రాణ గ్రాహకాలేనని అమెరికాలోని నార్త్‌వెస్టెర్న్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం 29 మందిని ఎంపిక చేసి నాలుగువారాల పాటు రోజుకు 4 గంటలే నిద్రపోయేలా చేస్తే.. వారు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డారు. కాబట్టి రాత్రి కంటినిండా నిద్రపోతే జంక్‌ఫుడ్‌కు బానిసలుగా మారే పరిస్థితి ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు.