మెదడు నాడుల్ని పీల్చి పెరుగుతున్న ట్యూమర్లు

24-09-2019: మనిషి ఆలోచనలకు మూలాధారం మెదడు. దానికి పొంచి ఉన్న పెనుముప్పు బ్రెయిన్‌ ట్యూమర్లు(మెదడు కణితులు). వాటిలోని కణాల ప్రవర్తనపై అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కణితుల్లోని కణాలు మెదడులోని నాడుల్లోకి చొరబడి వాటిలోని రసాయనాల్ని పీల్చేస్తున్నాయనే ఆశ్చర్యకరమైన విషయాన్ని తాజాగా గుర్తించారు. ‘గ్లియోమా’ అనే మెదడు కేన్సర్‌, ఛాతీ నుంచి మెదడుకు వ్యాపించే కొన్ని కేన్సర్‌ కణితుల్లో ఉండే కణాలు ఈవిధంగా ప్రవర్తిస్తున్నట్లు వెల్లడించారు.