కృత్రిమ తీపితో.. ఆకలి హెచ్చు!

01-09-2019: ఈ రోజుల్లో కృత్రిమ తీపిపదార్థాలు (ఆర్టిఫిషియల్‌స స్వీట్‌నెర్స్‌) వినియోగం సర్వసాధారణంగా మారింది. అయితే, వీటితో కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. కృత్రిమ తీపిపదార్థాలు ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతున్నాయన్న విషయంపై సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. సుక్రలోజ్‌, శాఖరైడ్‌, ఆస్పర్టైన్‌ వంటి కృత్రిమ తీపి పదార్థాలను విరివిగా ఉపయోగించడం వల్ల ఆకలిని నియంత్రించే మెదడు భాగం ప్రభావితమవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు.