ఇన్సులిన్‌తో కుటుంబ మధుమేహ చరిత్ర

23-08-2019: మధుమేహం కలిగిన వ్యక్తిలో ఉత్పత్తయ్యే ఇన్సులిన్‌ సాయంతో కుటుంబ మధుమేహ చరిత్రను తెలుసుకోవచ్చంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అంతే కాకుండా ఎముకల సాంద్రత పెరగడానికీ ఇన్సులిన్‌కు సంబంధం ఉందని చెబుతున్నారు. మహిళలపై తాము చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని నార్త్‌ అమెరికన్‌ మెనోపాస్‌ సొసై టీ తెలిపింది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే మహిళల్లో ఎముకల సాంద్రతను పరిశీలిస్తే.. ఆ కుటుంబంలో మధుమేహం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోవచ్చని సొసైటీ డైరెక్టర్‌ స్టీఫెన్‌ తెలిపారు.