హెల్త్ డ్రింక్‌తో ఇది కలిపితే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది

ఆంధ్రజ్యోతి(25-10-2016): ఆల్కాహాల్, హెల్త్ డ్రింకులు కలుపుకొని తీసుకుంటే కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతిని మెదడు కౌమార స్థితిలోకి వెళ్లిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. పుర్ద్యూ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ వాన్ రిజ్ని అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కొన్ని ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గమనించారు. అయితే ఇది మనుషుల్లో సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాని మాదక ద్రవ్యాల వాడకాన్ని ఎలుకల్లో ప్రయోగించి చూసిన తర్వాత, ఎన్నో ఔషద గుణాల కలయిక వల్ల మనుషుల్లో కూడా ఈ ప్రభావం కలుగవచ్చని తెలిపారు. సోడా కంటే ఈ విధమైన డ్రింక్ పది రెట్లు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందని, అందుకే తరుచూ కౌమార స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం వీటితోనే ఎక్కువని అధ్యయనం తెలిపింది. శిశు ఎలుకలలో ఇచ్చినప్పుడు, అవి కొకైన్ ఇచ్చిన ఎలుకలలాగానే శారీరిక, న్యూరోకెమికల్ సంకేతాలను చూపించాయని ఆయన చెప్పారు. దీంట్లో రెండు వేరు, వేరు పదార్థాలు కలిసి వారి ప్రవర్తనలో మార్పులు కలిగిస్తాయని, దీంతో వారి మెదడులోని నాడి వ్యవస్థ పని తీరు మార్పు చెందుతుందని రిచర్డ్ వాన్ తెలిపారు.