రక్తపోటు అదుపునకు వేడిమి చికిత్స!

15-09-2019: రాత్రుళ్లు నిద్రలో ఉన్నప్పుడు రక్తపోటులో అకస్మాత్తుగా వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే, వేడిమి చికిత్సతో దానిని అదుపులోకి తీసుకురావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. టెన్నెస్సీలోని వాండర్‌బిల్ట్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. దీని కోసం 76 ఏళ్ల సగటు వయసున్న వారిపై అధ్యయనం చేశామన్నారు. వారిలో ఒకరి మంచంపై 100 ఫారన్‌ హీట్‌ డిగ్రీల వేడిమి ఉన్న ప్యాడ్‌ను ఏర్పాటు చేయగా.. మరొకరి మంచంపై సాధారణ ప్యాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే, వేడి ప్యాడ్‌పై పడుకున్న వ్యక్తి రక్తపోటు సాధారణ స్థితికి రాగా.. అవతలి వ్యక్తి రక్తపోటులో హెచ్చుతగ్గులు అలాగే ఉన్నాయని చెప్పారు.