ఏఐతో గుండె వైఫల్యం గుర్తింపు

14-09-2019: కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ (సీహెచ్‌ఎ్‌ఫ).. అంటే గుండె పూర్తిస్థాయి సామర్థ్యంతో కొట్టుకోలేక విఫలం కావడం. 65 ఏళ్లు దాటిన వారిలో చాలామంది దీని బారిన పడుతుంటారు. ఆ ముప్పును ముందే గుర్తించడానికి వీలుగా.. ఈసీజీ వంటి కొన్ని రకాల పరీక్షలున్నాయి. కానీ, అవి కొంచెం ఎక్కువ సమయం పట్టేవి. కొన్ని సందర్భాల్లో తప్పు ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే పరిశోధకులు కన్వల్షనల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ (సీఎన్‌ఎన్‌) అనే కృత్రిమ మేధ (ఏఐ)ను రూపొందించారు. ఒక్క హార్ట్‌బీట్‌ను వినడం ద్వారా గుండె పనితీరును గుర్తించేలా వారు సీఎన్‌ఎన్‌కు శిక్షణ ఇచ్చారు. సీఎన్‌ఎన్‌ 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోందని వారి పరిశోధనలో తేలింది.