ముందస్తు మెనోపాజ్‌తో హృద్రోగాలు

17-10-2019: మహిళల్లో ముందస్తు మెనోపాజ్‌ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు తెలిపారు. 40 సంవత్సరాల లోపు మెనోపాజ్‌ వచ్చిన వారిలో ఈ ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని చెప్పారు. దాదాపు 3 లక్షల మంది మహిళలపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. ధూమపానం, ఊబకాయం వల్ల మెనోపాజ్‌ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. మందస్తు మెనోపాజ్‌ వచ్చినవారు వైద్యుల సలహాలు పాటిస్తే గుండె జబ్బుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు.