అక్రోట్లతో వ్యాధులకు గుడ్‌బై

టిబ్యురాన్‌(యూఎ్‌స), అక్టోబరు 20: వ్యాధులు దరిదాపులకు రావద్దంటే.. రోజూ గుప్పెడు అక్రోటులు తింటే చాలని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్‌లో ఉండే చాలామంది శాఖాహారులు ‘ఒమేగా-3 ఆల్ఫా లినోలిక్‌’(ఏఎల్‌ఏ) అనే కొవ్వు ఆమ్లం లోపంతో బాధపడుతున్నారని.. ఆ లోటు తీరాలంటే వారు రోజూ నాలుగు అక్రోటులు తినాలని సూచిస్తున్నారు. తద్వారా కేన్సర్‌, స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు దరిచేరవన్నారు. అక్రోటులు తినడం వల్ల పురుషుల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందన్నారు.