బహుమతికి.. నిద్ర తోడైతేనే అత్యుత్తమ ఫలితం!

 న్యూయార్క్‌, జనవరి 19 : ఓ ఉద్యోగి పనితీరు మెరుగుపర్చడానికి ‘బహుమతి’.. ‘ప్రశంస’ ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యమని అమెరికాలోని బ్రౌన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసిన కొంతమందికి ఓ పనిని అప్పగించారు. అది చేసే క్రమంలో నీళ్లు కానీ ఆహారం కానీ అడగకూడదనే నిబంధన పెట్టారు. కేటాయించిన పనిని పూర్తి చేసిన వారందరికీ చివర్లో తాగేందుకు కొన్ని నీళ్లు ఇచ్చారు. వారిలో కొంతమందికి మళ్లీ అదే పనిని అప్పగించగా, ఇంకొందరికి కాసేపు నిద్రపోయే అవకాశం కల్పించారు. వెంటనే పనిలోకి దిగిన వారికంటే.. నిద్రించి వచ్చినవారే మంచి ఫలితాలు సాధించినట్లు గుర్తించారు.