టిఫిన్‌కు ముందే వ్యాయామం మేలు

19-10-2019: ఉదయం పూట తినకుండా వ్యాయామం చేయడం వల్ల చాలా లాభాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. టిఫిన్‌ చేసిన తర్వాత వ్యాయా మం చేసేవారితో పోల్చితే వీరిలో కొవ్వు రెండు రెట్లు వేగంగా కరుగుతుందని చెప్పారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిపై నియంత్రణ ఉంటుందని తెలిపారు. ఫలితం గా ఊబకాయం, మధుమేహాన్ని నివారించవచ్చన్నారు. అంతే కాకుండా శరీరాకృతిలో కూడా వేగంగా మార్పు వస్తుందని తెలిపారు.