పంటి నొప్పికి.. ఈ ట్యాబ్లెట్స్‌ వాడొద్దు

29-10-2019: పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు సూక్ష్మజీవ నాశకాలు(యాంటీ బయోటిక్‌) బాగా వాడుతున్నారా? అయితే ఆ అలవాటును మానుకుంటే మంచిదని అమెరికన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సూక్ష్మజీవ నాశకాలు వాడాలని.. నిత్యం వాడుతూపోతే సైడ్‌ ఎఫెక్ట్‌ల బారినపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దంత సమస్యలు చుట్టుముడితే వైద్యచికిత్సకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. చల్లగా, తీయగా ఉండే సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగేవారిలో దంతక్షయం సమస్యలు అధికంగా గుర్తించినట్లు లండన్‌లోని కింగ్స్‌ కళాశాల శాస్త్రవేత్తలు వెల్లడించారు.