చిన్నవయసులోనే రుతుస్రావంతో మధుమేహం!

01-08-2019: మనం తినే ఆహారం, జీవనశైలితో మధుమేహం వచ్చే అవకాశాలు ముడిపడి ఉంటాయి. అయితే చిన్నవయసులోనే రుతుస్రావం మొదలైన వారికి భవిష్యత్తులో టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం అధికమని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) కూడా దీనికి కారణంగా నిలుస్తుందని వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా రుతుక్రమం ఆగిపోయిన 15 వేల మంది మహిళలను పరిశీలించారు. వారిలో 14 ఏళ్లకు ముందే రుతుస్రావం మొదలైన వారిలో ఎక్కువ మందికి టైప్‌-2 మధుమేహం వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా.. రుతస్రావం ఒక్కో సంవత్సరం ఆలస్యమయ్యే కొద్దీ టైప్‌-2 మధుమేహం అభివృద్ధి చెందే అవకాశం 6 శాతం తక్కువగా ఉంటుందని కూడా వారు పేర్కొన్నారు.