అధిక ఉప్పుతో డిమెన్షియా ముప్పు

27-10-2019: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరగడమే కాదు డిమెన్షియా కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘‘ఉప్పు వల్ల మెదడులో నైట్రిక్‌ ఆక్సైడ్‌ లోపం ఏర్పడుతుంది. ఇది మెదడులోని నాడీ కణాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియాకు దారితీస్తుంది’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక ఉప్పు వల్ల అల్జీమర్స్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది.